NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక…

1 min read

– ఏపీ మోడల్ స్కూల్ లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కండి  – ఏఐఎస్ఎఫ్

– పత్తికొండలో ఏపీ మోడల్ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండలో ఉన్నటువంటి ఏపీ మోడల్ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్ పాల్గొని వారు మాట్లాడుతూ పత్తికొండ ఏపీ మోడల్ కాలేజీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విద్యా సంవత్సరం ప్రారంభమై కొన్ని నెలలు కావస్తున్న ఇప్పటివరకు నలుగురు ఉపాధ్యాయులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఈ విషయం ప్రభుత్వాధికారులకు తెలిసిన అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదని ఉపాధ్యాయులు లేక బైపిసి గ్రూపుని తొలగించడం జరిగింది ఇందువల్ల ఎంత మంది విద్యార్థులు టీసిలి తీసుకుపోయి ప్రైవేట్ కాలేజీలో చేరడం జరుగుతుంది అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే మానుకొనే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత అధికారులు మొద్దు నిద్రను మానేసి పత్తికొండ ఈ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తున్నామని ఇక మూడు రోజులలో ఉపాధ్యాయ నియమించకపోతే ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు తెలియజేయడం జరిగింది. అనంతరం ఏపీ మోడల్ కళాశాల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది కళాశాల అధ్యక్ష కార్యదర్శులుగా పులి శేఖర్ ప్రవీణ్ కుమార్ సహాయ కార్యదర్శులుగా ఖాదర్ తో పాటు 12 మందిని ఎన్నుకోవడం జరిగింది గర్ల్స్ కన్వీనర్లుగా అనూష, భాగ్యలక్ష్మి, సుకన్య, సంధ్యా, శ్రావణి, కావ్య, కవిత, ప్రియా, ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ, మండల అధ్యక్షుడు సమీర్, పట్టణ కార్యదర్శి రమేష్ పట్టణ అధ్యక్షుడు వినోద్ సహాయ కార్యదర్శి పవన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

About Author