ఏఐటియుసి 104వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ రోజు హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ నందు AITUC 104వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా AITUC జెండాను CPI మండల కార్యదర్శి మారెప్ప చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి AITUC 104వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది._*ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న ముంబై మహానగరంలో లాలా లజపతిరాయ్, నారాయణ మల్హార్ జోషి, డివాన్ చామన్ లాల్, జోసెఫ్ బాప్టిస్టా, బిపిన్ చంద్రపాల్ నాయకత్వాన AITUC స్థాపించబడి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ దేశ స్వాతంత్ర పోరాటంలోనూ అనేక సంస్థల్లో జరిగిన పోరాటంలోనూ కార్మిక లోకాన్ని ఏకం చేసి కదిలించింది. వందేళ్ళ సుధీర్గ పోరాటంలో శ్రామిక, కార్మిక వర్గానికి AITUC భరోసాగా నిలిచింది, కార్మికుల పక్షాన AITUC చేపట్టిన పోరాట ఉద్యమాలతోనే అనేక హక్కులు సాధించబడ్డాయని, కార్మిక శ్రేయస్సు కోసం, స్వాతంత్ర్యం కోసం వీరోచిత పోరాటాలు సాగించిన చరిత్ర ఏఐటీయూసీకి మాత్రమే ఉంది. 20 గంటలు పనిని 8 గంటలకు తగ్గించాలని, వారంలో ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని పోరాటం చేసింది. చికాగో నగరంలో చిందించిన ఎర్రటి రక్తంతో “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అని పిలుపు నిచ్చింది. కార్మికుల హక్కుల సాధనకు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన సంఘం భారతదేశంలోనే మొట్టమొదటి సంఘం AITUC. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో కార్మికుల హక్కులకై పోరాటం చేసింది.పాలక ప్రభుత్వాల తీరుతో రైల్వే, పోస్టల్, బిఎస్‌ఎన్‌ఎల్ బ్యాంకు, రక్షణ రంగాలు పైవేటు పరం అయ్యి పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. ఎన్నో త్యాగాలతో, పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ చట్టాలను కాపాడుకునేందుకు కార్మికులు ఏఐటియూసి నాయకత్వంలో పోరాటాలు చేపట్టాలి. పాలకవర్గాలు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 గోడలుగా చేసి కార్మిక హక్కులను హరిస్తున్నారు. కార్మిక హక్కులను, చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారుస్తున్న ప్రభుత్వాలపై పోరును మరింత ఉదృతం చేయాలి.కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, అసంఘటిత కార్మికుల భద్రత, సామాజిక న్యాయం కోసం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడుతూ పాలకులు అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమ బాట పట్టాలని తెలుపుతూ కార్మిక శ్రేణులకు మరియు నాయకత్వానికి వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో AITUC మండల కార్యదర్శి రంగన్న రైతు సంఘం నాయకుడు కృష్ణ AITUC CPI నాయకులు షరీఫ్ మస్తా శివప్పా చందు బాషా జయరామ్ మోధిన్ బాషా షాబిర్ తదితరులు పాల్గొన్నారు.