ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలకు AITUC సంపూర్ణ మద్దతు
1 min read– ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలి
– డి శివ బాలకృష్ణ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన ఏపీ ఎన్జీవో అమరావతి జేఏసీ ఆందోళనకు నంద్యాల జిల్లా ఏఐటియుసి. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శివ బాలకృష్ణ పత్రిక ప్రకటన చేశారు. బాలకృష్ణ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే సామూహిక ధర్నాకు ఏఐటీయూసీ అనుబంధ ప్రజా సంఘాల మద్దతు ఉంటుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని, సిపిఎస్ రద్దు చేస్తానని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని ఉద్యోగులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ప్రసాద్ అన్నారు. ఆప్కాస్ విధానం వల్ల ఎన్నడూ లేని విధంగా కార్మికుల తీవ్రత ఇబ్బందులకు గురవుతున్నారని, పిఎఫ్ ఈఎస్ఐ కోసం అయితే తప్పనిసరిగా విజయవాడ వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారని, అందుబాటులో ఉండే కార్యాలయంలో పనులు జరగడం లేదని, అందుకే ఆప్కాస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. ఈనెల 25 జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సామూహిక ధర్నా, 29 సచివాలయాలు వద్ద ఆందోళనలకు ఉద్యోగులు తలపెట్టిన ఉద్యమానికి ఏఐటి యుసి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవి తదితరులు పాల్గొన్నారు.