‘మహానంది’ అధికారులపై.. ఏజేసీ ఫైర్
1 min read– ఇదేమీ కార్యాలయం.. అంటూ ఆగ్రహం
పల్లెవెలుగు వెబ, మహానంది: మహానంది ఆలయ కార్యాలయం అస్తవ్యస్థంగా ఉందని… ఇదేమీ కార్యాలయం… అంటూ ఆలయ అధికారులపై దేవాదాయ శాఖ అడిషనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానంది పుణ్యక్షేత్రవంలో స్వామి దర్శనం అనంతరం ఆయన ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. లడ్డు కౌంటర్‌ను పరిశీలించి అక్కడ నిల్వ ఉన్న వాటికి సంబంధించి రికార్డులను పరిశీలించారు. వంద కేజీల బియ్యం తక్కువగా ఉండటంతో ఏమయ్యాయని ఆలయ అధికారులను ప్రశ్నించారు. పులిహోర తయారీకి పంపామని అధికారులు సమాధానంగా చెప్పారు. లడ్డు తయారీ కేంద్రంలో ఉన్న గ్యాస్ సిలిండర్లను ఇతర చోటుకు తరలించాలని, ఈ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
చెడిపోయిన జనరేటర్‌ను విక్రయించి.. నిరుపయోగంగా ఉన్న వాటికి వేలం నిర్వహించి వచ్చిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు వద్ద ప్రైవేటు వ్యక్తుల ఫ్లెక్సీలలో ఆలయంపేరు కనిపించడంలేదని, వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. మహిళలు దుస్తులు మార్చుకునే తాత్కాలిక గది కూడా సక్రమంగా లేకపోవడంతో… ఇలా ఉంటే క్షేత్రానికి భక్తులు ఎలా వస్తారని నిలదీశాఉ. ఆయన వెంట ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్ ఏ ఈ ఓ మధు సూపరిండెంట్ ఓ వెంకటేశ్వర్లు ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.