PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

100 కోట్ల క్లబ్ లోకి `అఖండ` !

1 min read

పల్లెవెలుగువెబ్ : నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం అఖండ‌. ఈ సినిమా మొద‌టి రోజు నుంచే వ‌సూళ్ల సునామీ సృష్టిస్తోంది. కొత్త రికార్డులు నెల‌కొల్పుతోంది. బాల‌కృష్ణ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొద‌టి ప‌దిరోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ క‌లెక్షన్ సాధించింది. క‌రోన సెకెండ్ వేవ్ త‌ర్వాత బ్లాక్ బ‌స్టర్ హిట్ తో థియేటర్ల‌ను జ‌నంతో నింపిన సినిమాగా చెప్పవ‌చ్చు. అఖండ సినిమాతో నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి 100 కోట్ల క్లబ్ లోకి చేరారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి స్పెష‌ల్ షోలు వేయ‌కుండా, ప‌రిమిత టికెట్ ధ‌ర‌ల‌తో సినిమా విడుద‌ల‌యిన‌ప్పటికీ 100 కోట్ల క్లబ్ లోకి చేర‌డం విశేష‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

About Author