PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అఖండ‌’ గ‌ర్జన‌.. ట్విట్టర్ రివ్యూ !

1 min read

పల్లెవెలుగు వెబ్​: నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్రజ్ఞా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శక‌త్వంలో న‌టించిన చిత్రం `అఖండ‌`. ఈ సినిమా డిసెంబ‌ర్ 2న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. శ్రీకాంత్, జ‌గ‌ప‌తిబాబు ప్రధాన పాత్రలో న‌టించారు. సినిమాకు సంబంధించిన ట్విట్టర్ రివ్యూ వ‌చ్చేసింది. ప్రీ షోస్ చూసిన అభిమానులు ట్విట్టర్ లో త‌మ అభిప్రాయాల్ని పంచున్నారు. ట్విట్టర్ లో ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం..   ఫస్టాఫ్‌ చాలా బాగుందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. సెకండాఫ్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. తమన్‌ నేపథ్య సంగీతం అదిరిపోయిందట. బాలయ్య చెప్పే మాస్‌ డైలాగ్స్‌కి థియేటర్లలో ఫ్యాన్స్‌ ఈళలు వేయడం పక్కా అని ఓ నెటిజన్‌ కామెంట్‌చేశాడు. ఇక ఎప్పటి లాగే బాలయ్య తనదైన నటనతో రెచ్చిపోయాడట. అఘోరాగా బాలయ్య నటన సినిమాకే హైలెట్‌ అట. ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు.

About Author