PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అఖండ‌’ స్క్రీన్ సీజ్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :కృష్ణా జిల్లా మైల‌వ‌రం సంఘ‌మిత్ర థియేట‌ర్లో `అఖండ‌` సినిమా స్ర్కీన్ సీజ్ చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా బెనిఫిట్ ఫో ప్రద‌ర్శించారంటూ అధికారులు స్క్రీన్ సీజ్ చేశారు. సంఘ‌మిత్ర థియేట‌ర్లలోని రెండు స్క్రీన్ ల‌లో సినిమా ప్రద‌ర్శించారు. అభిమానులు కోరిక మేర‌కు 8:30 నిమిషాల‌కు బెనిఫిట్ షో ప్రద‌ర్శించిన అనంత‌రం ఉద‌యం ఆటను ప్రారంభించారు. విష‌యం తెలుసుకున్న అధికారులు ప్రభుత్వ నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా సినిమా ప్రద‌ర్శిస్తున్నారంటూ థియేట‌ర్లలోని బిగ్ స్క్రీన్ సీజ్ చేశారు. దీంతో బాల‌య్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

About Author