NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోతున్నారా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ న‌టీన‌టులు, దంప‌తులు అక్కినేని నాగ‌చైత‌న్య, స‌మంత జంట‌ విడిపోతున్నారంటూ టాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని, అందుకే విడిపోతున్నార‌ని టాలీవుడ్ లో వార్తలు చ‌క్కెర్లు కొడుతున్నాయి. అందుకే స‌మంత త‌న ట్విట్టర్ అకౌంట్లో అక్కినేని పేరును తొల‌గించి.. కేవ‌లం స‌మంత గాను ఉంచిన‌ట్టు తెలుస్తోంది. ఇరువురి స‌మ్మతంతో విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. కోర్టు ప్రక్రియ ఆల‌స్యం కానుండ‌టంతో స‌మంత త‌న నివాసాన్ని హైద‌రాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ పుకార్ల ను ఖండిస్తూ ఇరువ‌ర్గాల నుంచి ఎలాంటి ఖండ‌న రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇవి నిజంగా పుకార్లే అయితే ఎవ‌రో ఒక‌రు ఈ వార్తలను ఖండించి ఉండాల‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

About Author