అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అలగనూరు పిఎస్
1 min read– బాపట్ల జిల్లా వాసికి అభయహస్తం పింఛన్ మార్పు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: చేసే పనిలో నిజాయితీ సార్ధకత పేదవారికి సాయం చేయాలనే తపన అధికారులకు ఉండాలి.కానీ తన విధి నిర్వహణలో ముందుండి ఒక పేద వృద్ధురాలికి అభయహస్తం పింఛన్ మార్పు గురించి అసాధ్యమయ్యే పనిని సుసాధ్యం చేసి తన విధి నిర్వహణలో చాటుకున్న మన మండల పరిధిలోని అలగనూరు పంచాయతీ కార్యదర్శి ఎన్. అనురాధ.వివరాలు ఈవిధంగా ఉన్నాయి.బాపట్ల జిల్లా నాగారం మండలం శిరిపుడి గ్రామానికి చెందిన పాగోలు నాంచారమ్మ (60)భర్త పేరు పాగోలు నాంచారయ్య ఈమెకు అభయహస్తం పించను ప్రతినెల 500 రూపాయలు వస్తూ ఉండేది.కానీ గత సంవత్సరం నవంబర్ నెలలో ఈమె పింఛన్ ఐడి నెంబర్ మాత్రమే అలగనూరు గ్రామ సచివాలయానికి యాడ్ అయింది.ఈపింఛన్ ఐడి నెంబర్ ఎవరిదో నని తీరా అధికారులతో అక్కడి సచివాలయ సిబ్బందితో మాట్లాడితే తెలిసింది సిరిపుడి గ్రామానికి చెందిన వారని.పాగోలు నాంచారమ్మ కుటుంబ సభ్యులతో పంచాయతీ కార్యదర్శి అనురాధ మాట్లాడగా బాపట్ల జిల్లా సిరిపుడి గ్రామం నుంచి నాంచారమ్మ మరియు ఆమె కుమారుడు ఎంతో దూరం నుంచి కష్టపడి 500 రూపాయల పింఛన్ కొరకు వారు అలగనూరు గ్రామానికి వచ్చారు.ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,ఏవో దశరథ రామయ్య ఆధ్వర్యంలో ఆమె ఈకేవైసీ చేయించి అభయ హస్తం పింఛనును వారి సొంత గ్రామానికి అక్కడికి మార్చారు.అందుకుగాను పంచాయతీ కార్యదర్శి మరియు అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.