NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్15వ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం..

1 min read

– విచ్చేసిన ప్రముఖ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నగరం, ఫైర్ స్టేషన్ సెంటర్ లో విజయవాడ వారి అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ 1994 సంవత్సరంలో స్థాపించి అందరి మన్ననలు పొందుతూ 15వ నూతన బ్రాంచ్ ను శుక్రవారం ఉదయం కొల్లి విజయవర ప్రసాద్, బొప్పన సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరులోనే అతిపెద్ద అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ 15వ బ్రాంచ్ ప్రారంభించడం చాలా సంతోషకరమని తెలియజేశారు. హేలాపురి నగర వాసులకు స్వచ్ఛమైన నేతితో తయారుచేసిన స్వీట్స్, డ్రై ఫ్రూట్ స్వీట్స్, హాట్ ఐటమ్స్, కేక్స్, మిల్క్ షేక్స్, పిజ్జా, పావు బాజీ, పానీ పూరి వంటి వెరైటీ రుచులను నీ అభివృద్ధికి తగిన విధంగా అందిస్తామన్నరు. ఏలూరు ప్రజలకు అందరికీ అందుబాటు ధరల్లో క్వాలిటీ క్వాంటిటీలో రాజీ పడకుండా అందిస్త మన్నరు. ప్రశాంతమైన వాతావరణం లో ఫ్యామిలీతో విచ్చేసి టేస్ట్ చేయవచ్చని తెలియజేశారు. మీ చిన్నారులు ఇష్టపడే రుచికరమైన పదార్థాలు అందుబాటులో ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. నగరంలో పలు వ్యాపారస్తులు రాజకీయ ప్రముఖులు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు విచ్చేసి వ్యాపారంలో దిన దిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author