విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం
1 min read– విద్యార్థులు అందరూ అల్బెండజోల్ మాత్రలు వినియోగించుకునేలా చర్యలు చేపట్టండి
– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సంవత్సరానికి రెండుసార్లు పిల్లల చేత అల్బెండజోల్ మాత్రలు మింగించడం ద్వారా వారిలో రక్తహీనత, పోషకాహార లోపం తొలగించవచ్చునని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. గురువారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో దాదాపుగా 6 లక్షల 8 వేల 249 మందికి నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలలో పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పిల్లల్లో అత్యధిక శాతం రక్తహీనత లోపం వల్లనే ఎక్కువ అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రతి ఆరు మాసాలకు ఒక సారి నులిపురుగు మాత్రలు తీసుకోవడం ద్వారా రక్తహీనత లోపాన్ని అధిగమించడంతో పాటు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పిల్లల శరీరంలో నులిపురుగులు ఎక్కువ సంఖ్యలో ఉండడం వలన ఆక్సిజన్, హిమోగ్లోబిన్ శాతం తగ్గి, తరచుగా అనారోగ్యానికి గురికావడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని 1 నుంచి19 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు అందరు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు తీసుకునే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో రామగిడ్డయ్య, ఆర్.బి.యస్.కే (కోఆర్డినేటర్) హేమలత, డి.ఎం.వో నూకరాజు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ రఘురామిరెడ్డి, ఎయిడ్స్ అండ్ టీ.బి భాస్కర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున