అల్బెండజోల్ మాత్రలు విద్యార్థులు వినియోగించుకోవాలి..
1 min read– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్
– రక్తహీనత లోపం వల్లే పిల్లలు ఎక్కువ అనారోగ్యానికి లోనవుతారు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : సంవత్సరానికి రెండుసార్లు పిల్లల చేత అల్బెండజోల్ మాత్రలు మింగించడం ద్వారా వారిలో రక్తహీనత, పోషకాహార లోపం తొలగించవచ్చునని జిల్లా కలెక్టర్ వె .ప్రసన్న వెంకటేష్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురువారం ఏలూరులోని శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంట పద్మశ్రీ ప్రసాద్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఆశ, డీఈవో శ్యామ్ సుందర్, ఎన్. సి. డి. ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ మానస తో కలిసి విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4 లక్షల 536 మందికి నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ జరుగుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలలో పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పిల్లల్లో అత్యధిక శాతం రక్తహీనత లోపం వల్లనే ఎక్కువ అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రతి ఆరు మాసాలకు ఒక సారి నులిపురుగు మాత్రలు తీసుకోవడం ద్వారా రక్తహీనత లోపాన్ని అధిగమించడంతో పాటు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పిల్లల శరీరంలో నులిపురుగులు ఎక్కువ సంఖ్యలో ఉండడం వలన ఆక్సిజన్, హిమోగ్లోబిన్ శాతం తగ్గి, తరచుగా అనారోగ్యానికి గురికావడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని1 నుంచి19 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు అందరు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు తీసుకుని విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి ఎం. జె. వి. భాస్కరరావు, స్కూల్ హెడ్మాస్టర్ వి. స్రవంతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.