మద్యపానంతో వారికి ప్రమాదమే !
1 min readపల్లెవెలుగువెబ్ : మద్యపానంతో వయసు మళ్లిన వారితో పోలిస్తే యువతకే అనారోగ్య ముప్పు ఎక్కువట! మద్యం సేవనంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిపుణుల పరిశోధన ఫలితాలను లాన్సెట్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురించారు. 15–39 ఏళ్ల వారిలో ఆల్కహాల్ వల్ల ఆరోగ్యానికి రిస్క్ అధికంగా ఉంటున్నట్లు పరిశోధనలో తేలింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 40 ఏళ్లు దాటి, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు పరిమితంగా మద్యం తీసుకుంటే కార్డియో వాస్క్యులర్ జబ్బులు, గుండెపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గుతున్నట్లు వెల్లడయ్యింది.