అలర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం !
1 min read
పల్లెవెలుగువెబ్ : తిరుపతి, చిత్తూరు,అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర‍్వహణ సంస్థ డైరెక్టర్ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కాగా, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని తెలిపారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. తిరుపతి అర్బన్, రేణిగుంట, నారాయణవనం, కేవీబీపురం, నాగులాపురం, పిచ్చాటూరు, పుత్తూరు,నగరి, నిండ్ర, విజయపురం, మదనపల్లె, బి.కొత్తకోట, గుర్రంకొండ, కలికిరి,వాయల్పాడు,కురబలకోట, చిప్పగిరి, మద్దికెర ఈస్ట్, ఆదోని, ఆస్పరి, పెద్దకడుబూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంది.