అలర్ట్.. కరోన ఫోర్త్ వేవ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వెయ్యికి దిగువనే నమోదవుతున్నాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య ఒకేసారి రెండు వేలను దాటేసింది. గత 24 గంటల్లో..సోమవారం బులిటెన్ ప్రకారం.. 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు నమోదైన కేసుల సంఖ్య 1,150 మాత్రమే. అంటే కేసుల సంఖ్య ఒక్క రోజులోనే దాదాపుగా 90 శాతం మేర పెరిగింది. రోజూవారీ పాజిటివిటీ రేటు చూసుకుంటే.. 0.31 శాతం నుంచి 0.83 శాతానికి పెరిగింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో ఇన్‌ఫెక్షన్‌ల పెరుగుదల ఎక్కువగా నమోదు అయ్యింది. అయితే చాలాచోట్ల కేసులు తగ్గుముఖం పట్టిన పరిస్థితులు కనిపిస్తున్నా.. కొత్త వేరియెంట్లను తక్కువగా అంచనా వేయొద్దని, కేసులు ఒక్కసారిగా వెల్లువెత్తే అవకాశం లేకపోలేదని, ఈ పెరుగుదలను ఫోర్త్ వేవ్‌కి సంకేతాలుగా భావించి అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.