PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అల‌ర్ట్.. భూకంపం.. సునామీ హెచ్చరిక !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఫిలిప్పిన్స్ లోని పొంద‌గిటాన్ లో భూకంపం వ‌చ్చింది. రిక్టర్ స్కేలు పై తీవ్రత 7.1 గా న‌మోదైంది. పొంద‌గిటాన్ తూర్పున 63 కిలో మీట‌ర్ల దూరంలో భూకంపం వ‌చ్చిన‌ట్టు యూఎస్ జియోలాజిక‌ల్ సర్వే తెలిపింది. 65.5 కిలో మీట‌ర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మైన‌ట్టు పేర్కొంది. మ‌రోవైపు యూఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పిన్స్ కు సునామీ హెచ్చరిక‌లు జారీ చేసింది. ఫిలిప్పిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాల‌జీ, సిస్మాల‌జీ భూకంప న‌ష్టాన్ని అంచ‌నా వేశాయి.

About Author