అలర్ట్.. భారత్ లో మంకీపాక్స్ !?
1 min readపల్లెవెలుగువెబ్ : భారత దేశంలో మంకీపాక్స్ వైరస్ కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో మొట్టమొదటి మంకీపాక్స్ లక్షణాలు బయటకు వచ్చాయి. యూపీలోని ఘజియాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. కాగా, బాధితురాలి శరీరంపై దద్దరు రాగా, దురద ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో శాంపిల్స్ సేకరించి పూణేలోని ల్యాబ్‌కు టెస్ట్ కోసం పంపినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఇక, చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.