అలీకి రాజ్యసభ ఎంపీ ?
1 min read
పల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ నటుడు అలీని ఎంపీ పదవి వరించనుందా ?. అంటే అవుననే సమాధానం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై జరిగిన చర్చల కోసం గురువారం ఇక్కడకు వచ్చిన ఆలీని వారంరోజుల తర్వాత తనను కలవాలని సీఎం జగన్ సూచించారు. దీంతో ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరో 3నెలల తర్వాత ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు ఎంపిక కానున్నారు. అందులో ఒక సీటు మైనార్టీలకు ఇచ్చే ఆలోచనలో ఉన్న జగన్… ఆ అవకాశం ఆలీకి కల్పించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సందర్భంగా రాజమండ్రి అసెంబ్లీ టికెట్ ఆశించిన ఆలీకి ఆ అవకాశం దక్కలేదు. అయినా వైసీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అలీని రాజ్యసభకు ఎంపిక చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.