మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి : ఈఓ
1 min read– మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
– 11 రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: 11 తేదీ. ఉదయం. 8.45ని యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 21వ తేదిన రాత్రి జరిపే పుష్పోరువ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.మహాశివరాత్రి ఉత్సవాల్లో.. పార్వతీ పరమేశ్వరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల తిరుపతి దుర్గామల్లేశ్వరస్వామి కాణిపాకం దేవస్థానాల ఆలయ అర్చకులు శ్రీశైల మల్లన్న పట్టువస్త్రాలు సమర్పిస్తారు స్వామి అమ్మవార్లు కళ్యాణోత్సవానికి ముందుగా అర్థరాత్రి 12 గంటల అనంతరం స్వామివారికి పాగాలంకరణ ప్రారంభం అవుతుంది. కంకణాలు ధరించివచ్చిన పాదయాత్ర భక్తులకు, ప్రత్యేక క్యూలైన్ ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో రద్దీ కారణంగా భక్తులందరికీ కూడా 11.నుండి 21. వరకు -స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే అవకాశం కల్పించారు అధికారులు గతంలో బ్రహ్మోత్సవాల ప్రారంభములో 5 రోజులపాటు అనగా 11.నుండి 15 వరకు జ్యోతిర్ముడి కలిగివున్న శివదీక్షా భక్తులకు నిర్ధిష్టవేళలో మాత్రమే స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం కల్పించబడుతున్నారుప్రత్యేక క్యూలైన్ ద్వారా శివదీక్షా భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆలయ ఉత్తరభాగంలో గల చంద్రవతి కల్యాణముండపం నుంచి శివదీక్షా భక్తుల క్యూలైన్ ప్రారంభమవుతుంది దర్శనానంతరం పాతాళ గంగ రోడ్ లోని శివదీక్ష శిబిరాల వద్ద స్వాములకు ఇరుముడి కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్యూణాంప్లెక్స్ నందు 14 కంపార్టుమెంట్లలో ఉచిత దర్శన భక్తులు వేచివుండే అవకాశం గుర్తించబడింది 8 కంపార్టుమెంట్లలో శీఘ్రదర్శనం క్యూలైన్లో భక్తులు వేచివుండే అవకాశంకల్పించబడింది. చంద్రవతి కళ్యాణమండపంలో 4 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశారు క్యూకాంప్లెక్స్ లో దర్శనాలకు వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు. అల్పాహారం కల్పించారు పాతాళ గంగ రోడ్ లోని శివరీక్ష శిబిరాల్లో జ్యోతిర్ముడి విరమణ స్వాములకు అన్ని ఏర్పాట్లు చేశారు.భక్తులకు అతిశీఘ్రదర్శనం. దర్శనం టికెట్లు 500/ ఆన్లైన్లోరోజుకు 5000 ఉంచారుమరియు 2000 అతిశీఘ్రదర్శనం టికెట్లు ఆన్లైన్లోఉంచబడ్డాయి.ఆన్లైన్ టికెట్లు పొందిన భక్తులు వేకువజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు దర్శనాలను చేసుకోవచ్చు భక్తులకు 30 లక్షల లడ్డును ప్రసాదాలు అందుబాటులో ఉంచారు మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 30 పడకల ఆసుపత్రిని నిర్మించడం అన్నారురోజుకు 30 లక్షలగ్యాలన్ల మంచినీరుసరఫరా చేయడం జరుగుతుంది.క్షేత్ర పరిధిలో వివిధ ప్రదేశాలలో ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు క్షేత్రపరుదులు ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఈఓ లవన్న తెలియజేశాడు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.