బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాలి.. ఎం.పి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/16-4.jpg?fit=550%2C413&ssl=1)
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బీసీలందరూ కలిసికట్టుగా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు.. పార్లమెంటులో బీ.సీ బిల్లు పెట్టడంతో పాటు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీలో జాతీయ బీ.సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ దేశంలో బీసీ జనాభా గణనీయంగా పెరుగుతుందని, జనాభా అనుగుణంగా బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు… బీసీల హక్కుల కోసం ఆర్.కృష్ణయ్య అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఆయన పోరాట ఫలితంగానే నేడు ఎంతో మంది బీసీలు ప్రజా ప్రతినిధులు గా కొనసాగుతున్నారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన ఎం.పీలు, ప్రజాప్రతినిధులు, మరియు బీ.సీ సంఘం నాయకులు పాల్గొన్నారు.