పిల్లలందరికీ తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలి…
1 min readపిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్న డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్
చాటపర్రులో ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయిస్తున్న డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్
పల్లెవెలుగు వెబ్ పశ్చిమగోదావరి : పల్స్ పోలియో ,ఇళ్ళ రిజిస్ట్రేషన్స్ కార్యక్రమాలను డిపిఓ శ్రీనివాస్ పరిశీలిoచారు. పేదలందరికీ ఇళ్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వారీ ఆదేశాలతో ఆదివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.శ్రీనివాస్ విశ్వనాథ్ చెప్పారు. ఇందులో భాగంగా ఆదివారం ఏలూరు మండలం చాటపర్రు సచివాలయాన్ని ఆయన సందర్శించి ఇళ్ళ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. సచివాలయం పరిధిలో 313 రిజిస్ట్రేషన్స్ వేయవలసి వుండగా ఇంతవరకు 268 పూర్తి కాగా మరో 45 పెండింగ్ లో ఉన్నాయన్నారు.వాటిలో వివిధ కారణాల వల్ల 33 తిరస్కరించగా,మరో 11 పెండింగ్ లో వున్నయాన్నరు.ఇందులో ఈరోజు ఉదయం 9.30 నాటికి 3 రిజిస్ట్రేషన్స్ పూర్తి కాగా,మరో ఎనిమిది బ్యాలన్స్ ఉన్నాయన్నారు. పోలియో చుక్కలు వేసిన డి పి వో ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని డి పి వో శ్రీనివాస్ విశ్వనాథ్ చెప్పారు. చాటపర్రులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి అధికారి సరళ కుమారి, కార్యదర్శి శ్రీనివాస్, విఏవో సిబ్బంది, ఆశ వర్కులు తదితరులు పాల్గొన్నారు.