PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యుత్ ఉద్యోగులందరూ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి..

1 min read

– ఏపీ ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ ఎస్ ఇ  పి.సాల్మన్ రాజు

– ఉద్యోగ సంఘ నాయకులు తురగా  రామకృష్ణ పర్యవేక్షణలో ఉద్యోగులకు వైద్య పరీక్షలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : విద్యుత్ ఉద్యోగులందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఏపీ ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ ఎస్ఈ పి సాల్మన్ రాజు సూచించారు ఎస్ఈ సాల్మన్ రాజు ఆదేశాల మేరకు ఏలూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి శశిధర్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు తురగా రామకృష్ణ పర్యవేక్షణలో విద్యుత్ ఉద్యోగులకు విద్యుత్ భవనంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. నిష్ణాతులైన డాక్టర్లు విద్యుత్ ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ సాల్మన్ రాజు మాట్లాడుతూ నిరంతరాయంగా విధి నిర్వహణలో నిమగ్నమైన ఉద్యోగులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదన్నారు విద్యుత్ ఉద్యోగులకు 24 గంటలు పనిచేస్తుంటారని విశ్రాంతి అనేది వీరికి ఉండదన్నారు. విద్యుత్ ఉద్యోగులు వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి నిరంతరం పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు అన్ని రకాల వ్యాధులకు డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం ఝాన్సీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, త్రివాసు, కృష్ణ రాజా, కే గోపాల కృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ సదాశివరావు, ఆయుష్ ఆసుపత్రి డాక్టర్ ఎమ్ ఎల్ వి సాయికృష్ణ, డాక్టర్ కె రమ్య, డాక్టర్ బి భాను కిరణ్, డాక్టర్ కవిత, డాక్టర్ సోమరాజు విద్యుత్ ఉద్యోగులకు వైద్య సేవలు అందజేశారు.

About Author