జిల్లాలో అన్ని ఫ్యాక్టరీలలో రక్షణ చర్యలు ఉండేలా పర్యవేక్షించాలి..
1 min readసంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశం
ఫ్యాక్టరీలు పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ నందు నమోదయి ఉండాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులతో సమావేశంపై ఫ్యాక్టరీలు, పెట్రోల్ బంకులలో ఉండాల్సిన రక్షణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నమోదైన 61 ఐస్ ఫ్యాక్టరీలలో రక్షణ చర్యలను పర్యవేక్షించి నివేదిక అందజేయాలన్నారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు తప్పనిసరిగా పరిశ్రమల శాఖ నుందుగానీ, కార్మిక శాఖ నందు గాని నమోదు అయి ఉండాలన్నారు. రొయ్యలు ఫ్యాక్టరీలలో ఉండే అమోనియా ఐస్ ఫ్యాక్టరీల్లో కూడా ఉంటుందని దీని ప్రమాద తీవ్రతను గుర్తించి రొయ్యల ఫ్యాక్టరీలలో చేపట్టిన రక్షణ చర్యలను ఐస్ ఫ్యాక్టరీలలో కూడా చేపట్టాలన్నారు. అలాగే పెట్రోల్ బంకులలో ఏర్పాటుచేసిన రక్షణ చర్యలపై కూడా నివేదికను అందజేయాలన్నారు. రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్. త్రినాధరావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి శ్రీనివాస్, జిల్లా కార్మిక శాఖ అధికారి ఎ.లక్ష్మి, జిల్లా పరిశ్రమ అధికారి యు మంగపతి రావు, ఉయ్యాల ఆదిశేషు, తదితరులు పాల్గొన్నారు.