PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నీ మంచి శకునములే..

1 min read

సినిమా డెస్క్​ : యంగ్‌ హీరో సంతోష్ శోభన్‌ ‘పేపర్ బాయ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్‌గా ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. తాజాగా ‘అన్నీ మంచి శకునములే ’ అనే టైటిల్ తో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ‘ఓ బేబీ ’ ఫేమ్‌ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా టైటిల్ ను ప్రకటిస్తూ టీమ్‌ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది.
టైటిల్‌లో లాగానే మోషన్ పోస్టర్ కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఒక హిల్ స్టేషన్‌ను మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఈ పోస్టర్ లో చూపించారు. టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ తోనే ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. సంతోష్ శోభన్‌కి జోడీగా మాళవిక నాయర్ నటిస్తోంది. స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వెన్నెల కిషోర్ – రావు రమేష్ – నరేష్ – గౌతమి – రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

About Author