PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టభద్రులందరూ …ఓటు నమోదు చేసుకోవాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కర్నూల్ మండలం , ఈ తాండ్రపాడు గ్రామంలో, ఈ తాండ్రపాడు టిడిపిగ్రామ కమిటీ అధ్యక్షులు రామాంజనేయులు గారి అధ్యక్షతన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ భీమ్ రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి టిడిపి అభ్యర్థి ఎమ్మెల్సీ ఓటరు నమోదు గురించి ఈ తాండ్రపాడు గ్రామంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి, కర్నూలు మండల టిడిపి అధ్యక్షులు బుర్ర వెంకటేష్ నాయుడు గారు, కర్నూలు పార్లమెంట్ టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు గారు, హాజరై ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ నాయుడు గారు మాట్లాడుతూ…. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులివెందుల పులిబిడ్డ భీమ్ రెడ్డిశ్రీ రామ్ గోపాల్ రెడ్డి గారికి పట్టభద్రుల నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, బాలకృష్ణ అభిమానులు, నందమూరి అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని, మనకు తెలిసిన ప్రతి కుటుంబంలో డిగ్రీ, డిప్లొమా, డాక్టర్ కోర్సు, డిగ్రీ కు సమానమైన పట్టభద్రులందరూ తమ ఓటరు నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా, నిరుద్యోగులకు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా, డీఎస్సీ నిర్వహించకపోవడం, ఈ ప్రభుత్వం దిగజారుడుతనానికి నిరసనమని, నిరుద్యోగ యువతీ, యువకులు, చదువుకున్న మేధావులు ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోని, 2023 మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భీమ్ రెడ్డిశ్రీరామ గోపాల్ రెడ్డి గారి విజయానికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు గారు, కర్నూలు పార్లమెంటు టిడిపి పార్టీ కోశాధికారి అయిన పి సత్యనారాయణ యాదవ్ గారు, కర్నూలు పార్లమెంటు టిడిపి మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు యం సయ్యద్ గారు, ఎంపీటీసీ టు లక్ష్మీదేవి భర్త టి వెంకటేశ్వర్లు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టి బోజ్జన్న గారు, ఈ తాండ్రపాడు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు టి రామాంజనేయులు గారు, లక్ష్మన్న ,గోపాల్, టిఆర్ వెంకటేశ్వర్లు, హోటల్ కృష్ణ, గరిక నెత్తి వెంకటేశ్వర్లు, ఎం రాజేంద్ర బాబు గారు, తదితరులు హాజరయ్యారు.

About Author