PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో

1 min read

– ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో

-మండల వైద్య అధికారి డాక్టర్ చెన్నారెడ్డి ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి, పి హెచ్ సీ కమిటీ చైర్మన్ ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్,లు అన్నారు, బుధవారం స్థానిక ఎంపీడీవో సముదాయంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బాధ్యతాయుతంగా పనిచేయడం జరుగుతుందని, అలాగే మండలంలోని గ్రామపంచాయతీలలో ఉండే ఆరోగ్య ఉప కేంద్రాలను కూడా అభివృద్ధిపరిచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 12 మందికి కంటి చికిత్స నిమిత్తం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా ఆసుపత్రులకు పంపించడం జరిగిందన్నారు, దీంతో వారందరికీ కంటి చూపు వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సహకారంతో, ప్రజలకు ఎటువంటి మందులు కొరత లేకుండా ప్రతి ఒక్కరికి మందులతో పాటు, వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల తో పాటు చెన్నూరు కు చెందిన వారు కూడా 80 మంది నుండి 100 మంది వరకు ఓపికి రావడం జరుగుతుందని వారు తెలియజేశారు, ప్రజలు ఇంకా దీనిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని వారు తెలిపారు, అంతేగాకుండా ఇక్కడ ఓపి తోపాటు, ప్రతి సోమవారం చర్మవ్యాధుల డాక్టర్, జనరల్ మెడికల్ డాక్టర్ అందుబాటులో ఉంటారని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మండల ప్రజలు పీహెచ్సీ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, చల్లా వెంకటసుబ్బారెడ్డి వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author