PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ సంఘటితం కండి

1 min read

– ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ.

– చిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి.

– ప్రభుత్వ పథకాలు పునరుద్ధరించారు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సర్వీసు రూల్స్ ఏర్పాటు చేయాలి.ఉమ్మడి కర్నూలు జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజన సభలో ఏపీ జెఎసి అమరావతి జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి, ఏపీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ సంఘటితమై జిల్లా స్థాయిలో బలోపేతం కావాలని ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి ఏపీ కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు పేర్కొన్నారు.ఆదివారం కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవన్లో ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజన సభ జరిగింది.ఈ సభకు గిరి కుమార్ రెడ్డి, అల్లం సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సభ ఉద్దేశించి గిరి  కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఐకమత్యంతో ముందుకు సాగి ప్రభుత్వాన్ని మెప్పించి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆ విధంగా జిల్లాలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ సంఘటితం కావాలన్నారు. తక్కువ వేతనానికి ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అభద్రతాభావంతో పనిచేస్తున్నారని ఉద్యోగ భద్రత పద్ధతి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చిరుద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ఏపీ జెఎసి అమరావతి ఎల్లప్పుడూ చొరవ చూపుతోందని ఆయన తెలియజేశారు. ఏపీ కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. పెరిగిన నిత్యవసర వస్తువులు ధరలకు అనుగుణంగా  వేతనాలు సరిపడక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ పథకాలు నిలిపివేశారని దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగ కుటుంబ సభ్యులు  ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ పథకాలన్నీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింప చేయాలన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చాలీచాలని వేతనాలు అయినప్పటికీ కుటుంబాలను భారంగానే నెట్టుకుని వస్తున్న తరుణంలో ప్రభుత్వ పథకాలను కూడా నిలిపివేయడం దారుణమని పథకాలన్నీ పునరుద్ధరించాలని సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొని అభద్రత భావంతో పనిచేస్తున్నారని తెలుపుతూ రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

నూతన కమిటీలు ఏర్పాటు :-

ఉమ్మడి కర్నూలు జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజనసభలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి ఏపీ కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నూతన జేఏసీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి అనుసంధానంగా పనిచేస్తాయని ఏపీ కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు తెలియజేశారు.. నూతనంగా ఏర్పాటు అయిన జిల్లా కమిటీలను ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు అభినందించారు.కార్యక్రమంలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు మస్తాన్, రాముడు, నాగరాజు, దాసన్న ,శుభనాయక్, అమిదాబి, నెల్లూరు జిల్లా జేఏసీ కార్యదర్శి రాజేష్, అన్నమయ్య జిల్లా జేఏసీ చైర్మన్ చంద్రశేఖర రావు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ శాఖల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author