కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి జీవించాలి.. టిజి భరత్
1 min read– రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రంజాన్ తోఫా పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమం అని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని జివి ఫంక్షన్ హాల్ లో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టిజి భరత్ పాల్గొని రంజాన్ తోఫాను ప్రజలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తానా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఇక అన్ని కులాలకు మతాలకు ఈనెల ఎంతో పవిత్రమైనది అన్నారు. పవిత్ర రంజాన్ మాసం తో పాటు ఈస్టర్ పండుగ, హనుమాన్ జయంతి ఒకే నెలలో రావడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కులం మతం చూడకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. దాదాపు 700 మందికి రంజాన్ తోఫా అందజేయడం గొప్ప విషయం అన్నారు. భవిష్యత్తులో మరింత మందికి అందించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, టిడిపి పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు ఇంచార్జ్ ఆకెపోగు ప్రభాకర్, నిర్వాహకులు సయ్యద్ షా ఫహాద్, నిరంజన్, సురేష్, నాదిర్ భాష, తదితరులు పాల్గొన్నారు.