NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆల్ రౌండ‌ర్ ఆండ్రూ సైమండ్స్ ఇక లేరు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే స్పిన్‌ దిగ్గజం షేన్ వార్న్ అకాల మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్‌ మృతితో యావత్‌ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. తన ఆటతో అనతి కాలంలోనే ఆస్ట్రేలియా టీమ్‌లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా సైమండ్స్‌ పేరు తెచ్చుకున్నారు. కెరీర్‌లో 198 వన్డేలు ఆడిన సైమండ్స్‌.. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

                                      

About Author