బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి – ఎంఈఓ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: 5 నుండి 18 సంవత్సరములు గల పిల్లలందరూ పాఠశాలలో నమోదవ్వాలని, ఎవరు కూడా బడి బయట ఉండరాదని, అలాగే తల్లిదండ్రులు పిల్లలను కూలికి పంపకూడదు మరియు 18 సంవత్సరాల లోపు పిల్లలకు ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయరాదని, ఎంఈఓ మేరీ సునీత బిలకలగూడూర్ సచివాలయంలో బుధవారం నాడు వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులుని మరియు హజరత్ హుస్సేన్ని మండల అబ్జర్వర్గా నియమించారు, వీరు మండల పరిధిలోని అందరూ వాలంటీర్లతో సమావేశమై విద్యార్థులందరూ పాఠశాలలో నమోదు అయ్యారా లేక బడి బయట ఉన్నారా అనే విషయాన్ని పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్ కి సమర్పిస్తామని. వీరితోపాటు మండల అధికారులు, మండల అభివృద్ధి అధికారి శివ మల్లేశ్వరప్ప పెసర వాయి కరిమద్దుల, తహశీల్దార్ శ్రీనివాసులు గడివేముల, గడివేముల2, ఈ ఒ ఆర్ డి అబ్దుల్ ఖాలిక్ మంచాలకట్ట, గని, ఒoడుట్ల, ఎంఈఓ1 మేరీ సునీత, బిలకలగూడూరు, బూజునూరు, కొర్రపోలురు, ఎంఈఓ 2 విమల వసుంధర దేవి, చిందుకూరు, గడిగరేవుల కొరటమద్ది, దుర్వేసి సచివాలయాల పరిధిలోని అన్ని గ్రామాలలో పరిశీలిస్తారు, ఈ సందర్భముగా తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని ఎంఈఓ మేరీ సునీత ప్రజలను కోరారు.