సకల పాపహరణం.. శ్రీ దుర్గ భోగేశ్వర దర్శనం..
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని గడిగరేవుల గ్రామం వద్ద వెలసిన శ్రీ దుర్గ భోగేశ్వర స్వామి ఆలయం రాష్ట్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. కాశీలో తప్పితే ఎక్కడా లేని కాలభైరవుడు ఆలయంలో భక్తులకు దర్శనమిస్తాడు. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కలగలిసిన చారిత్రాత్మక ఆలయం నంద్యాల నుండి 12 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన జనమేజయ మహారాజు హయాంలో నిర్మించినట్టు చుట్టుపక్కల శిలా శాసనాలలో లిఖించబడి ఉంది ఈ ఆలయ నిర్మాణ శైలిలో 5 కోనేరులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి పాల కోనేరు పెరుగు కోనేరు నెయ్యి కోనేరు చక్కెర కోనేరు తేనె కోనేరు ప్రసిద్ధి చెందాయి పూర్వం అన్నా చెల్లెలు చేసి తప్పులకు ప్రాయశ్చిత్తం మహర్షుల సలహా మేర దేశవ్యాప్తంగా ఆలయాలు తిరిగిన జరగని ప్రాయశ్చిత్తం ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక. పాప విముక్తి జరిగినట్టు చరిత్ర చెబుతోంది ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినాన భక్తుల నడుమ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆలయ చైర్మన్ రాచమల్లు గోపాలయ్య ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల మూడవ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వచ్చే భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఆవరణలో మెడికల్ క్యాంపు కాశిరెడ్డి నాయన నిత్య అన్నదాన సత్రం లో ఆర్యవైశ్య అన్నదాన సత్రం లో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు అలాగే 28వ తేదీ గ్రామోత్సవం తో మొదలై మూడో తేదీ స్వామివారి రథోత్సవం తో కార్యక్రమం ముగింపు ఉంటుందని తెలిపారు సాంస్కృతిక కార్యక్రమాలు లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారిచే నృత్య ప్రదర్శన విశ్వా కళా స్రవంతి నాట్య మండలి వారిచే పంచమంకమాలు మాటీవీ ఎన్.శ్రీనివాస హైదరాబాద్ వారిచే రేలారే రేలారే కార్యక్రమం ఏర్పాట్లు చేసినట్టు రైతు సంబరాలు గుండు సందా పందెములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు . వచ్చిన భక్తులకు భద్రతా ఏర్పాట్లను సీఐ జీవన్ గంగనాథ్ బాబు . ఎస్సై శ్రీధర్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.