‘న్యూస్ నేడు ’ కు ఆల్ ది బెస్ట్
1 min read
–రాష్ట్ర వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్
కర్నూలు: ప్రజలకు.. ప్రభుత్వానికి మద్య వారధిగా వ్యవహరించే మీడియా… దేశం, రాష్ట్రాభివృద్ధిలో దాని పాత్ర ఎంతో కీలకమన్నారు రాష్ట్ర వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ . ఆదివారం మంత్రి తన ఛాంబరు కార్యాలయ ఆవరణలో ‘ న్యూస్ నేడు ’ దినపత్రికను కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ వాస్తవాలను వెలికి తీసే మీడియా.. నిజాలను నిర్భయంగా రావాలని సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం దృష్టిలో పెట్టుకుని పని చేస్తోందన్నారు. సీఎం చంద్ర బాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, సంక్షేమ, అభివృద్ధి పథకాలను మీడియా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ‘ న్యూస్ నేడు ’ దినపత్రిక అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా రాష్ట్ర వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ ఆకాంక్షిస్తూ… శుభాకాంక్షలు తెలియజేశారు.