NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగన్‌ ఇచ్చిన హామీలన్నీ అందని ద్రాక్షగా మారాయి

1 min read

తెలుగు యువత నిరసన             

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు అందని ద్రాక్షలా మారాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ విమర్శించారు. ఈ ఏడాది జనవరి ఒకటికి కూడా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల  చేయకపోవడంపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ ఆధ్వర్యంలో పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో మంగళవారం వినూత్న రీతిలో మరమరాలు(బొరుగుల మిక్చర్) అమ్ముతూ నిరసన తెలిపారు. నిరుద్యోగులు, తెలుగు యువత మరమరాలు(బొరుగుల మిక్చర్) అమ్ముతూ జాబ్‌ క్యాలెండర్‌-2024 లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ జగన్‌ అని ప్రశ్నించారు.ఐదు సంవత్సరాల పాలనలో యువతకు ఉద్యోగావకాశాలు ఎక్కడ అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకి సంఘీభావంగా అడ్వకేట్లు మైరాముడు,బాలభాష,మల్లికార్జున, తాయన్న,రవి బోరుగులు,కార కొనుగోలు చేసి సంఘభావం తెలియజేశారు.ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన  లోకనాథ్ మాట్లాడుతూ, ‘జగన్‌ ఇచ్చిన హామీలన్నీ బుట్ట దాఖలయ్యాయి అని విమర్శించారు. ప్రతి  సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక పట్టుమని పది వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు అన్నారు. గ్రామ, వార్డు, డివిజన్‌ సచివాలయాల ఉద్యోగాలు, వాలంటీర్లను నియమించి  అవి కూడా ఉద్యోగాలని ప్రచారం చేసుకునే స్థాయికి దిగజారడం సిగ్గుచేటు అని అన్నారు.మెగా డీఎస్సీ నిర్వహించి 23,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి విస్మరించారు అని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చేందుకు జగన్‌ ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేశారన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక 1,345 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీకాంత్ చౌదరి, తుగ్గలిమండలం తెలుగు యువత ఉపాధ్యక్షుడు గంగసాని మోహన్, అశోక్, ప్రసాద్,తదితర నిరుద్యోగులు పాల్గొన్నారు.

About Author