ప్రగతిలో ఉన్న పనులన్నీ మార్చి 15 నాటికి నూరు శాతం పూర్తి చేయాలి
1 min read
ఆర్ బ్ల్యూఎస్ శాఖ అంగన్వాడి కేంద్రాల్లో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, త్రాగునీటి సరఫరా,రైన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రగతిపై సమీక్ష
మహిళా శిశు సంక్షేమ శాఖలో చేపట్టిన ప్రగతి పనులపై జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్
మార్చి15 నాటికి నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశం
జిల్లాకలెక్టర్ కె.వెట్రిసెల్వి
పల్లెవెలుగు ఏలూరుజిల్లా ప్రతినిధి: ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా,శిశు సంక్షేమశాఖ లో చేపట్టిన పనుల ప్రగతిపై బుధవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్షించారు. ఆర్ డబ్ల్యూఎస్ వారిచే అంగన్వాడీ కేంద్రాలలో నిర్మిస్తున్నటువంటి మరుగుదొడ్లు, త్రాగునీటీ సరఫరా మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణల ప్రగతి పై కలెక్టర్ సమీక్షించారు.ప్రస్తుతము పూర్తయిన పనులకు సంబంధించి 28 ఫిబ్రవరి నాటికి బిల్లులు చెల్లింపులు చేయాలన్నారు. ప్రగతిలో ఉన్న పనులన్నీ మార్చి 15 నాటికి నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలోఆర్ డబ్ల్యూఎస్ ఏస్ఈసత్యనారాయణ,ఐసిడిఎస్ పిడి శారద,జిల్లాలోని సిడిపివోలు మరియు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు పాల్గొన్నారు.