PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగ్గురూ మొనగాళ్లే..

1 min read

సినిమా డెస్క్​ : లెజండరీ యాక్టర్‌‌ కమల్‌ హాసన్‌ నటిస్తున్న సినిమా ‘విక్రమ్‌’. ఇది ఆయన నటిస్తున్న రెండొందల ముప్ఫై రెండో మూవీ. ‘విక్రమ్‌’ ఫస్ట్‌ లుక్‌ నిన్న రిలీజైన సందర్భంగా కమల్‌ ‘యుద్ధంలో గెలిచినవాడే కిరీటాన్ని ధరిస్తాడు. మేం మరోసారి మా టాలెంట్స్‌ని మీ ముందు ప్రదర్శించబోతున్నాం. మీరు కూడా మరోసారి మమ్మల్ని గెలిపించండి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో హేమాహేమీలైన విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి వెర్సటైల్‌ యాక్టర్స్‌ ఆయనతో తలపడే విలన్స్‌గా నటిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు విడుదలైన ఫస్ట్ లుక్‌ చూశాక అవి మరింత పెరిగాయి. ముగ్గురు మహా నటులూ ఒక టిపికల్‌ లుక్‌లో ఉన్నారీ పోస్టర్‌‌లో. గుబురు మీసాలూ గడ్డాలూ.. తీక్షణమైన చూపులు.. ముఖాలకు గాట్లు.. చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. ఓ కేసులో ముఖ్య సాక్షిని కాపాడటానికి కమల్ ట్రై చేస్తారట.. ఆ సాక్షిని చంపే విలన్‌గా ఫహాద్, అతనికి సాయపడే పోలీసాఫీసర్‌‌గా సేతుపతి కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. ముగ్గురు గ్రేట్ యాక్టర్స్‌ ఇలా ఒకే చిత్రంలో నటించడం మాత్రం నిజంగా పెద్ద విశేషమే.

About Author