PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో

1 min read

– ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో
– మండల వైద్య అధికారి డాక్టర్ చెన్నారెడ్డి ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని( సిహెచ్ సి) ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని , ఇప్పటికే 70 మంది నుండి 80 మంది వరకు, ఓపి కి రావడం జరుగుతుందని పీహెచ్సీ కమిటీ చైర్మన్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మండల వైద్యాధికారి డాక్టర్ బి, చెన్నారెడ్డిలు తెలిపారు, శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కే ఓ ఆర్ కాలనీలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకే చోట ఉండడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇబ్బందులు ఉండేవని తెలిపారు, కాగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సహకారంతో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, డాక్టర్ వైయస్సార్ విలేజ్ క్లినిక్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, ఇటు చెన్నూరు టౌన్, అలాగే మైనార్టీ కాలనీ, కొండపేట, బలసింగన పల్లె , కనపర్తి తదితర గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, అయితే ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుందని, ఇప్పటికే 70 మంది నుండి 80 మంది వరకు ఓపికి రావడం జరుగుతుందని వారు తెలియజేశారు, ప్రజలు ఇంకా దీనిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని తెలియజేశారు, అంతేగాకుండా ఇటీవల జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో పిహెచ్సి విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరిగిందని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు, దీనికి సమాధానం గా పిహెచ్సి నిర్మాణానికి రెండు కోట్ల యాభై లక్షలు అదేవిధంగా పిహెచ్సి అనుమతి కొరకు ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగిందని త్వరలోనే మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఎంపీపీ తెలిపారు, అలాగే ఇక్కడ ఓపి తోపాటు, ప్రతి సోమవారం చర్మవ్యాధుల డాక్టర్, జనరల్ మెడికల్ డాక్టర్ అందుబాటులో ఉంటారని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మండల ప్రజలు పీహెచ్సీ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author