PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకులంతా మహర్షి వారసులే…

1 min read

– వాల్మీకి రవీంద్ర చౌదరి అంతర్జాతీయ వాల్మీకి సంఘ అధ్యక్షులు
పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: భారతదేశంలోని ఉత్తర,దక్షణ రాష్ట్రాలలో ఉన్న వాల్మీకులందరు వాల్మీకి మహర్షి వారసులేనని అంతర్జాతీయ వాల్మీకి సంగం అధ్యక్షులు వాల్మీకి రవీంద్ర చౌదరి అన్నారు . తెలంగాణ,ఆంద్రప్రదేశ్ లో ఉన్న వాల్మీకి మహర్షి ఆలయాలు,విగ్రహాలు సందర్శన సందర్భంగా నిన్న సాయంత్రం నంద్యాలలోని బొగ్గులైన్,దేవనగర్,బస్టాండ్ లలో ఉన్న వాల్మీకి మహర్షిని సందర్శించి నంద్యాల జిల్లా వాల్మీకి నేతలతో కలిసి మాట్లాడుతూ తెలుగు మాట్లాడే రాష్ట్రాలలో వాల్మీకి జాతి చాలా నష్టపోతుందని కారణం వీరికి st రిజర్వేషన్ లేకపోవటమేనని,రాజకీయ నేతలు తమ రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం వాల్మీకి జాతికి వ్యత్యాసాలు పెట్టారని ,ఆంద్రప్రదేశ్ లో ఓ విచిత్రమైన ప్రాంతీయ వ్యత్యాసం విన్నానని ఇది చాలా దారుణమని ఏజన్సీ వాల్మీకులు st లుగా,మైదాన ప్రాంత వాల్మీకులు బీసీ లుగా విభజించి పాలించటం నీచపు రాజకీయానికి పరాకాష్ట అని వాల్మీకులు ఎక్కడున్నా అంతా ఒక్కటేనని కనుక తెలుగు మాట్లాడే రాష్ట్రాలలో వాల్మీకులను st లుగా పునరుద్ధరించాలని ,ఈ మధ్య కేంద్రం వాల్మీకులకు లిపి ఏముందని మాట్లాడినట్లు తన దృష్టికి వచ్చిందని కానీ తాను అనేక దేశాలు,రాష్ట్రాలు తిరిగానని ఎక్కడ వాల్మీకులకు ప్రత్యేక లిపి లేదని ఇది పాలకుల దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని ఈ దేశంలో 29 రాష్ట్రాలలో వాల్మీకులు ఉన్నారని 27 రాష్ట్రాలలో ఒకచోట sc, మరో చోట st లుగా ఉన్నారని ,తెలుగు రాష్ట్రాలలో వ్యత్యాసం ఉంది అంటే ఇది రాజకీయ కుట్రలో భాగమే అన్నారాయన తెలుగు రాష్ట్రాల వాల్మీకులకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడతామని,ఢిల్లీ వేదికగా జరిగే ఉద్యమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు అనంతరం విఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ పులికొండన్న,వాల్మీకి సంఘ సీనియర్ నాయకులు మహేష్ నాయుడు గార్ల ఇళ్లలో రవీంద్ర చౌదరి,వారి సతీమణి వాల్మీకి ప్రియాంక చౌదరి లను సన్మానించి ప్రియాంక చౌదరి గారికి పసుపు,కుంకుమ అందించారు వీరి వెంట పులికొండన్న ,మహేష్ నాయుడులతో పాటు విఆర్పీఎస్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మదుగోపాల్, పార్లమెంట్ గౌరవ సలహాదారులు న్యాయవాది సుబ్బరాయుడు,పట్టణ అధ్యక్షులు ఓబులేసు,యూత్ అధ్యక్షులు పరమేష్,విద్యార్థి నేత శివనాగేంద్ర ,మాజీ సర్పంచ్ కాశన్న,మల్లికార్జున,సవారీ,సాయి,మధు, రవి,హరి,శేఖర్,బాలు,చిన్నమహేష్,మహిళా నేత బోయ భారతి,బొగ్గులైన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author