వొకేషనల్ జూనియర్ కళాశాలలకు అల్లాబకాష్ సేవలు మరువలేనివి
1 min read– అల్లాబకాష్ మృతి బాధాకరం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా వొకేషనల్ జూనియర్ కళాశాలలకు అల్లా బకాష్ సేవలు మరువలేనివని అల్లాబకాష్ మృతి చెందడం బాధాకరమని ప్రెసిడెంట్ శ్రీ వేణుగోపాల్, సెక్రెటరీ శ్రీ దేవదానం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వొకేషనల్ జూనియర్ కళాశాలల కోర్సు విషయంలో ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేసిన మహా వ్యక్తి అల్లాబకాష్ అన్నారు. అలాగే ఇస్లామియా వొకేషనల్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ గా ఆయన సేవలు మరువలేనివి అన్నారు. అల్లాబకాష్ వొకేషనల్ కోర్సు విషయంలో అనేక పోరాటాలు చేయడంతో పాటు రాష్ట్ర నాయకునిగా పనిచేసే వొకేషనల్ జూనియర్ కళాశాలల అభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషించిన వ్యక్తి అన్నారు. ఆయన పోరాట ఫలితమే ప్రస్తుతం వొకేషనల్ కోర్సులో పలువురు విద్యార్థులు రాణిస్తున్నారు అన్నారు. ఉన్నఫలంగా గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబానికి తాము అందరం కలిసి అండగా ఉంటామని కుటుంబానికి భరోసా కల్పించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సునీల్, జాయింట్ సెక్రెటరీ దివాకర్, ట్రెజరర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.