NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్ఐఏ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఎన్ఐఏ పై ఆర్టీఐ కార్యక‌ర్త అఖిల్ గొగొయ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉపా చట్టం కింద న‌మోదైన రెండు కేసుల్లో నిర్దోశిగా బ‌య‌ట‌ప‌డిన ఆయ‌న ఎన్ఐఏ పై తీవ్రవిమ‌ర్శలు చేశారు. బీజేపీలో గానీ, ఆర్ఎస్ఎస్ లో గానీ చేరితే 10 రోజుల్లో బెయిల్ వ‌స్తుంద‌ని ఎన్ఐఏ ఆఫ‌ర్ చేసిన‌ట్టు ఆయ‌న ఆరోపించారు. లేదంటే 10 ఏళ్ల జైలు శిక్ష త‌ప్పదంటూ హెచ్చరించింద‌ని అన్నారు. బీజేపీలో చేరితే మంత్రి ప‌ద‌వి కూడ వ‌స్తుంద‌ని ఒక ఎన్ఐఏ అధికారి చెప్పిన‌ట్టు ఆయ‌న ఆరోపించారు. ఎన్ఐఏ ను బీజేపీ ఓ అస్త్రంగా వాడుకుంటోంద‌ని, త‌న కేసుల్లో వ‌చ్చిన తీర్పును చారిత్రాత్మక‌మైన‌దిగా అభిర్ణించారు. ఈ తీర్పు ద్వార ఉపా, ఎన్ఐఏ చ‌ట్టాలు దుర్వినియోగం అవుతున్నాయ‌ని తేలింద‌ని చెప్పారు.

About Author