PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘డిప్​’ ద్వారా ’లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్’ లో షాపుల కేటాయింపు

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్  ఉన్నత న్యాయస్థానం (21.10.2021న) వెలువరించిన తీర్పును, సర్వోన్నత న్యాయస్థానం ( 17.12.2021న) వెలువరించిన తీర్పు అనుసరించి శ్రీశైలం లలితాంబికా షాపింగ్​ కాంప్లెక్స్​లో షాపుల కేటాయింపునకు శుక్రవారం ఈఓ లవన్న ఆధ్వర్యంలో డిప్​ నిర్వహించారు. కళ్యాణ మండపంలో నిర్వహించిన డిప్​ నిర్వహణ ద్వారా దుకాణాల కేటాయింపునకు 53 మంది డిస్ప్లేసుడు టెనెంట్స్ పాల్గొన్నారు. కొందరు దుకాణదారులు లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపులకు దేవస్థానం కాగా నిర్ణయించిన నెలసరి అద్దె అధికంగా ఉన్నదని గౌరవ ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించివున్నారు. ఈ విషయమై బుధవారం రోజున (29.12.2021) తీర్పు వెలువడనున్నది. కావున ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉన్నత న్యాయస్థానం వెలువరించనున్న ఈ తీర్పు అనుసరించి దుకాణముల కేటాయింపుపై తదుపరి చర్యలు గైకొనబడుతాయి. అదేవిధంగా 2019  ఆగస్టు మాసములో లలితాబింకా షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాములకై నిర్వహించబడిన బహిరంగ వేలములో పాల్గొన్న దుకాణదారులలో కొందరు ఉన్నత న్యాయస్థానములో వ్యాజ్యమును దాఖలు చేయడం జరిగింది.

ఈ విషయమై గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పు అనుసరించి బహిరంగవేలములో హెచ్చు పాటను పాడిన 42 మంది పిటిషనర్లలో 39 మందికి డిసెండింగ్ ఆర్డరు ప్రకారంగా షాపు అద్దెలను కూడా తెలియజేశారు.   ఈ విషయములో కూడా ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉన్నత న్యాయస్థానం బుధవారం 29.12.2021వెలువరించనున్న తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శుక్రవారం శ్రీశైల కార్యనిర్వహణాధికారి లవన్న  ఆధ్వర్యములో  జరిగిన  డిప్ నిర్వహణలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, సహాయ కమిషనర్ ( ఇంఛార్జి) మరియు సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహరెడ్డి, శ్రీశైలప్రభసంపాదకుడు డా.సి. అనిల్ కుమార్, పర్యవేక్షకులు డి. రాధకృష్ణ, బి, మల్లికార్జునరెడ్డి, ఎన్, శ్రీహరి, కె.శివప్రసాద్.బి. శ్రీనివాసులు పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author