కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు 25 వీల్చైర్ల కేటాయింపు
1 min read
ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
పల్లెవెలుగు , కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్ ఓలు సంయుక్తంగా 25 వీల్చైర్లు కేటాయించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సందర్భం గా ఈ వీల్చెర్లను దివ్యాంగులు, వృద్ధుల కోసం ఉన్నతాధికారులు తెప్పించారు. ఇవి ప్రజలకు ఉపయోగ పడేలా నిర్ణయం తీసుకుని ఆసుపత్రికి కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం వీటిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు కి అందజేశారు. తక్షణమే ఇందులోని పది వీల్ చైర్లను క్యాజువాలిటీకి, మరియు న్యూ డయాగ్నస్టిక్ విభాగానికి పంపించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఇతర విభాగాలకు ఎవరికైనా అవసరమైతే ఇన్డిపెండెంట్డెంట్గా తెప్పించుకుని అందజేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో సీఎస్ఆర్ఎంఓ డా.బి.వెంకటేశ్వరరావు, ఎమర్జెన్సీ విభాగపు హెచ్ ఓ డి, డా.రామ్ శివ నాయక్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, డా.కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.