PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

` ఆస్ట్ర‌ల్` బ్రాండ్ అంబాసిడ‌ర్ గా అల్లుఅర్జున్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ బిల్డింగ్ మెటీరిల్స్ త‌యారీ సంస్థ‌ ఆస్ట్రల్ లిమిటెడ్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో జట్టు కట్టింది. తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆస్ట్రల్‌కు చెందిన కైరవ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌తో ఒప్పందంతో తాము కీలక మైలురాయిని చేరుకున్నట్టు చెప్పారు.దక్షిణ భారత రాష్ట్రాల్లో తమ బ్రాండ్ ఈక్విటీని తిరిగి బలోపేతం చేసుకునే లక్ష్యంతో అల్లు అర్జున్‌ను భాగస్వామిగా చేసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మార్కెట్లో తాము మరింతగా నిలదొక్కుకునేందుకు ఈ బంధం తోడ్పడుతుందని అన్నారు. నటుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నాణ్యతకు, నూతన ఆవిష్కరణలకు ఆస్ట్రల్ ప్రసిద్ధి చెందినదని అన్నారు. అలాంటి కంపెనీతో జత కడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

                                             

About Author