PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవుడిగా అల్లు అర్జున్‌

1 min read
దేవుడిగా అల్లు అర్జున్‌

సినిమా డెస్క్: సుకుమార్‌‌ దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌‌టైన్‌మెంట్‌‘పుష్ప’ లో నటిస్తున్న అల్లు అర్జున్.. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓ తమిళ రీమేక్ చిత్రంలో బన్నీ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారని.. అది కూడా ఓ దేవుడి పాత్ర అనే వార్తొకటి ఫిలిం సర్కిల్స్ లో వైరల్‌ అవుతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలుగులో ఆ పాత్ర కోసం మేకర్స్ అల్లు అర్జున్‌ని సంప్రదిస్తున్నారట. ఇదే కనుక నిజమైతే బన్నీని మోడ్రన్ గాడ్ గా చూసే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పోషించింది దేవుడి పాత్ర. ఇక ఇప్పుడు తెలుగులో ఆ పాత్రలో నటించడానికి వరుస సినిమాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ అంగీకరిస్తారో లేదో చూడాలి. బన్నీ గతంలో గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రంలో గోన గన్నారెడ్డి అనే అతిథి పాత్రలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా అశోక్ సెల్వన్ – రితికా సింగ్ జంటగా తెరకెక్కిన ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్ లో విశ్వక్ సేన్ – మిథిలా పాల్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమాస్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పీవీపీ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఒరిజినల్ వెర్సన్‌ని డైరెక్ట్ చేసిన అశ్వత్ మారిముత్తు తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తారు. ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారని సమాచారం. ఇంకా ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

About Author