PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఐకాన్’ స్టార్ గా అల్లు అర్జున్..

1 min read

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడుగా తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ సినిమాలో పుష్పరాజ్ అనే ఎర్రచంద‌నం స్మగ్లర్ గా అల్లు అర్జున్ క‌నిపిస్తున్నారు. అల్లు అర్జున్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. ఈ సినిమాలో చాలా భిన్నంగా ఉన్నాయి. పాత్ర నేటివిటికి త‌గ్గట్టుగా అల్లుఅర్జున్ త‌న రూపాన్ని మార్చుకున్నారు. బుధ‌వారం పుష్ప టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సుకుమార్ లేకుంటే త‌ను లేన‌ని అన్నారు. సుకుమార్ ఏది ఇచ్చిన జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంద‌ని అన్నారు. ఆర్య సినిమా స‌మ‌యంలో స్టైలిష్ స్టార్ అని బిరుదు ఇచ్చార‌ని… ఇప్పుడు పుష్ప సినిమాకి ఐకాన్ స్టార్ అని బిరుదు ఇచ్చార‌ని అల్లు అర్జున్ అన్నాడు. జీవితంలో పైకి ఎద‌గాలంటే..త‌గ్గకూడ‌ద‌ని అన్నారు. స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు వెన‌క్కి త‌గ్గితే ఓట‌మిని చ‌విచూడాల‌ని.. త‌గ్గకుండా ముందుకుపోతే విజ‌యం సాధిస్తామ‌ని అన్నారు. త‌గ్గేదే ల్యా అంటూ అభిమానుల్ని ఉర్రూత‌లూగించారు. ఈసినిమాకి ద‌ర్శకుడు సుకుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్.

About Author