ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ వీరేశప, అధ్యాపకుల చేత బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.