టీజీబీ యూత్ ఆధ్వర్యంలో అయ్యప్పస్వాములకు భిక్ష
1 min read
పల్లెవెలుగు వెబ్: నగరంలోని పాత అయ్యప్పస్వామి ఆలయంలో కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పడిపూజ నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వాములతో కలిసి భజన చేశారు. తర్వాత టిజి భరత్.. స్వామికి నైవేద్యం మోసుకొచ్చి సమర్పించారు. అనంతరం ఆలయంలోని అయ్యప్పస్వాములకు భిక్ష వడ్డించారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ ఎంతో నిష్ఠతో మాలాధారణ చేసిన అయ్యప్పస్వాములతో కలిసి పడిపూజ నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. పాత అయ్యప్పస్వామి ఆలయంతో తనకెంతో అనుబంధం ఉందన్నారు. అయ్యప్పస్వాములకు ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మా టిజిబి యూత్ ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
