NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం

1 min read

పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: చెన్నూరు వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని, ములపాకు వద్ద పుష్పగిరి రోడ్డులోని లారెన్స్ వృద్ధాశ్రమంలో చెన్నూరు బుడ్డాయిపల్లి కి చెందిన టిపి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅధితిగా పాల్గొన్న రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అధ్యక్షులు పులి సునీల్ కుమార్,వైస్సార్సీపీ నాయకులు ఆవుల నవనీశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ గుమ్మా రాజేంద్రప్రసాద్ రెడ్డి, కార్యకర్త లకు అందుబాటులో ఉంటూ, వారికష్ట సుఖలలో పాలుపంచుకోవడం ,జరుగుతుంది అన్నారు,అంతేకాకుండా పార్టీలో తనదైన శైలిలో ప్రతిఒక్కరిని కలుపుకొని పోవడం జరుగుతున్న దన్నారు, కల్మస్యం లేని,మంచిమనసున్న నిరంతర శ్రామికుడు గుమ్మా రాజేంద్రప్రసాద్ రెడ్డి అని తెలిపారు, తనను నమ్ముకున్న వారికోసం ఎంతవరకైనా అనేవిధంగా ,అలాగే రాజకీయంగా ఎప్పుడు కూడా ఏపదవులు ఆశించకుండా,పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తి గుమ్మా రాజేంద్రప్రసాద్ రెడ్డి, అని వారు తెలిపారు,, ఈకార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్రసాని నిరంజన్ రెడ్డి,గాజులపల్లె సాయినాథరెడ్డి,సునీల్ కుమార్, వై,విష్ణు వర్ధన్ రెడ్డి, గాజులపల్లె నాగేంద్ర రెడ్డి, పాల్గొన్నారు.

About Author