PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంచార జీవులకు అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: బ్రతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి గుడిసెలు వేసుకొని జీవిస్తున్న సంచార జాతుల వారికి బుధవారం రాయచోటి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ పాలగిరి శ్రీనివాస కుమార్ రాజు 50 వ జన్మదిన సందర్భంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ పాలగిరి శ్రీనివాస్ కుమార్ రాజు భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రంజిత్ రాయల్, మల్లికార్జున, బ్రహ్మానంద రెడ్డి, వెంకి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author