జగనన్నకు తోడుగా పేద ప్రజలకు అండగా కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జగనన్నకు తోడుగా పేద ప్రజలు అండగా “అన్న వస్తున్నాడు” అనే కార్యక్రమంలో భాగంగా గురువారం పత్తికొండ పట్టణంలోని బండిగేరులో నాలుగో రోజు కొనసాగింది. బండి గిరిలోని కుట్టు శిక్షణ పొంది ఉచితంగా కుట్టు మిషన్లు పొందిన మహిళలు ఎక్కువగా ఉన్నందున, ప్రతి కుటుంబం ఉత్సాహంగా పొచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డిపై అక్కడి మహిళలు ఆదరాభిమానాలు వ్యక్తం చేశారు. అలాగే వారి సంతోషానికి అవధులు లేని విధంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో శ్రీ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి సేవాదళ్ కుటుంబ సభ్యులైన ప్రతి ఇంటికి వెళ్లి వారి క్షేమ సమాచారములు అడిగి తెలుసుకున్నారు. వారు చెబుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు కార్యాలయ సిబ్బందిచే రాసుకుంటూ , కుటుంబాలు చెప్పే సమస్యలను సావధానంగా వింటూ సమస్యలను పరిష్కార దిశగా వెళుతున్నారు. సమస్యలు ఉన్నచోట నేనున్నానని ధైర్యం చెబుతూ మురళీధర్ రెడ్డి ముందుకు సాగారు. అదే వీధిలోని ఒక మహిళ వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు ఒక డాక్టర్ను నెలకు ఒక మారు వచ్చేలా ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు స్పందిస్తూ శ్రీ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి ఇకపై సేవాదళ్ కార్యాలయం నందు ప్రతినెల ఒక మహిళా( గైనిక్ ) డాక్టర్ ను నియమిస్తామని మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఉచితంగా ఆరోగ్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మురళీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్తీకమాసంలో ప్రతి ఆడపడుచుకు చీర, పసుపు, కుంకుమ ఇస్తూ మహిళలు వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోచిమిరెడ్డి సేవాదళ్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు.