చదువుతోపాటు ఆటలు వ్యాయామం ఎంతో అవసరం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కళాభారత్ సేవా సమితి తేదీ 2 5 2023 ఉదయం 9 గంటలకు కళాభారత్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కరాటే యోగా బాక్సింగ్ వెపన్స్ ఏరోబిక్స్ వంటి అంశాలను ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బిజెపి పట్టణ కన్వీనర్ ప్రకాష్ జైన్ ప్రారంభించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతోపాటు ఆటలు వ్యాయామం ఎంతో అవసరమని తద్వారా క్రమశిక్షణ శక్తివంతమైన సమాజాన్ని తయారు చేసేది చిన్నారులని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఇటువంటి అంశాలను ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడుతుందని తద్వారా మంచి క్రమశిక్షణ కలిగిన సమాజం తయారవుతుందని తెలియజేశారు ఇటువంటి అంశాలకు ఎప్పుడైనా తమను సంప్రదిస్తే తమ వంతు సహాయ సహకారాలను అందజేస్తారని తెలియజేశారు సందర్భంగా కేశవమాసం మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రకాశం జైన్ గారు కళాభారత్ సేవా సమితి వారికి 20 వేల క్రీడా పరికరాలన వితరణ గావించారు ప్రకాష్ జైన్ గారు సేవా దృక్పథం కలిగిన వ్యక్తి అని అన్నివర్గాలకు సహాయ సహకారాలు అందిస్తారని వారు ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కళాభారత్ సేవా సమితి వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి యువరాజు గారు మండల అధ్యక్షులు బి ఉష రాజ్ గారు యువ మోర్చా జిల్లా కోశాధికారి సంజయ్ పాండే గారు మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రాథోడ్ గారు శివకుమార్ గారు మైలార్ చిన్న గారు తదితరులు పాల్గొన్నారు ఈ క్యాంపునకు దాదాపుగా 200 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరైనరని తెలియజేశారు ఇంకా ఎవరైనా శిక్షణా శిబిరమునకు పాల్గొనదల్చినవారు శ్రీ గట్టు వీరయ్య శెట్టి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల స్కూల్ నందు సంప్రదించవలెనని తెలియజేశారు.